విశాఖపట్టణానికి చెందిన పంచకర్ల రమేష్ బాబు వైసీపీ లో బలమైన నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే చిన్న చిన్న మనస్పర్థలు మరియు మిస్ అండర్ స్టాడింగ్ వలన ఈ రోజు ఉదయం వైసీపీ కి గుడ్ బై చెప్పేశారు. మీడియా ముఖంగా పంచకర్ల రమేష్ బాబు వైసీపీ నుండి తప్పుకున్నట్లు రాజీనామా చేశాడు. కాగా తర్వాత రాజకీయంగా ఏమి చేయనున్నారు అన్న ప్రశ్నకు సమాధానంగా, పవన్ కళ్యాణ్ తో తన ప్రయాణాన్ని కొనసాగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎటువంటి స్వార్ధం లేకుండా ప్రజల కోసం పడుతున్న కష్టం చూసి చలించిపోయిన పంచకర్ల అతనితో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నాడట. తన కార్యకర్తలు నుండి అందుతున్న సమాచారం ప్రకారం రేపు పవన్ ను కలిసి జనసేన లో చేరడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.
జనసేనలోకి పంచకర్ల రమేష్ బాబు… పెందుర్తి నుండి ఎన్నికల్లో పోటీ !
-