ఇంటర్వూ ప్రశ్న: రెస్ట్‌రూమ్‌, టాయిలెట్‌, వాష్‌రూమ్‌ వీటి మధ్య తేడాలేంటి..?

-

కొన్ని ఉద్యోగాలకు కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్‌ ఉంటే సరిపోదు. లోకజ్ఞానం కూడా కావాలి. సివిల్స్‌కు ప్రీపేర్‌ అయ్యేవాళ్లకు ఇది బాగా తెలుసు. అలాగే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాం.. దానికి మీకు సమాధానం తెలుసో, లేదో చూడండి.. తెలియదు కాబట్టే మీరు టైటిట్‌ చూసి స్టోరీలోకి వచ్చి ఉంటారు కదా..!!
హోటల్ మేనేజ్‌మెంట్ చేసేవారికి ఇంటర్వ్యూల్లో ప్రత్యేకమైన ప్రశ్నలు అడుగుతారు. వాటిలో ఇదొకటి. చాలామంది వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్, టాయిలెట్ అన్నీ ఒకటే అనుకుంటారు. అది పొరపాటు. ఈ మూడూ ఒకటి కాదు. వాటి మధ్య తేడాలు ఉన్నాయి.. అవేంటంటే..

ఏదైనా హోటల్‌, మాల్‌కి వెళ్లినప్పుడు అక్కడ మన అవసరానికి తగ్గట్టుగా వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్, టాయిలెట్ వేర్వేరుగా ఉంటాయి. అన్నీ ఒకటే అనుకుంటే సమస్య వస్తుంది.

బాత్రూమ్ అంటే.. స్నానం చేసే సౌకర్యం ఉన్న చోటును బాత్రూమ్ అంటారు. ఇందులో షవర్, బకెట్, సోప్ ఇతర స్నానానికి అవసరమైనవి ఉంటాయి. ఒక్కోసారి ఇందులో ఎటాచ్డ్‌ టాయిలెట్ ఉంటుంది. కొన్నిసార్లు ఉండకపోవచ్చు.

వాష్‌రూమ్ అర్థం : వాష్‌రూమ్ అనేది సింక్, టాయిలెట్ సీటు రెండింటినీ కలిగి ఉండే గది. ఇక్కడ అద్దం ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ స్నానం చేయడానికి కానీ, బట్టలు మార్చుకోవడానికి ఎలాంటి వీలు ఉండదు. చాలా మాల్స్, సినిమా హాల్స్, ఆఫీసులు మొదలైన వాటిలో వాష్‌రూమ్‌లు ఉంటాయి.

రెస్ట్ రూమ్ అర్థం : రెస్ట్‌ రూమ్‌ అంటే రెస్ట్‌ తీసుకునే రూమ్‌ అనుకుంటారు చాలా మంది. ఇది అమెరికన్ ఆంగ్ల పదం. మనకు టాయిలెట్ అని అర్థం. మనం బ్రిటన్ ఇంగ్లీష్ వాడుతాం కాబట్టే.. మనకు ఈ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఇండియాలో రెస్ట్‌రూమ్‌కి వెళ్తే.. అక్కడ మనకు టాయిలెట్ కూడా ఉంటుంది.

లావెటరీ అర్థం : ఈ పదం నిజానికి లాటిన్ నుంచి వచ్చింది. లాటిన్‌లో లెవటోరియం అంటే వాష్ బేసిన్ లేదా వాష్‌రూమ్. దీనిని లావెటరీ అంటారు. ఇందులో టాయిలెట్ సీటు ఉంటుంది. దీన్నే మనం టాయిలెట్ అంటాం.

టాయిలెట్ అర్థం : టాయిలెట్ లేదా టాయిలెట్ రూమ్ అనే పదాన్ని టాయిలెట్ సీటు అమర్చిన ప్రదేశానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇక్కడ ఇంకేమీ ఉండదు. అన్నీ ఒకేలా ఉన్నట్లు ఉన్నాయి కదా. కానీ వేరుగా ఉంటాయి. అదే మ్యాజిక్కు..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version