పరా డబ్బా.. పరస్పర డబ్బా తప్ప సాధించింది ఏమీ లేదు.. చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాణి ఫైర్

-

చంద్రబాబు నాయుడు నిన్న రేవంత్‌రెడ్డితో ఏం చర్చించారో రాష్ట ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కూటమిలో ఉన్న మూడు పార్టీలు సమాధానం చెప్పాలి. వెంకటేశ్వరస్వామి ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరింది నిజామా కాదా? అని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. చంద్రబాబు రూపంలో ఆంధ్ర ప్రదేశ్ కి పాపం తగిలింది. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణం. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పారిపోయి వచ్చారు అని విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఆస్తులు వదిలేసి ఎందుకు పారిపోయి వచ్చారు.” అంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి నిలదీశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ ఆరంభ శూరత్వాలే. ఆయన అనుకూలం మీడియా ఆహా.. ఓహో అనడం తప్ప సాధించిన ఫలితాలు లేవు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశంపై ఎంతో హైప్ క్రియేట్ చేశారు. ఈ భేటీలో ఏ అంశాలపై స్పందించారో.. వేటికి పరిష్కారం లభించిందనే విషయాన్ని వెల్లడించలేదు అని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కోసం ఒక ఆర్కిటెక్ మాదిరిగా చంద్రబాబును రేవంత్‌రెడ్డి పిలిచినట్టుంది” అంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు.ఈ సమావేశానికి ఒక దశ.. దిశా లేదు.. పరా డబ్బా.. పరస్పర డబ్బా తప్ప సాధించింది ఏమీ లేదు అని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా వీరి చర్యలు ఉన్నాయి అని మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version