పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి మీకెందుకు?.. దర్శకుడు విశ్వనాథ్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి దర్శకుడు విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ ఒరిజినల్ ‘పరంపర’ సిరీస్ దర్శకుడు విశ్వనాథ్ తాజా ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్, ఆయన సినిమా, రాజకీయాల గురించి పలు విషయాలు మాట్లాడారు.

రాజకీయాల్లోకి సేవ చేయడం కోసం వచ్చిన పవన్ కల్యాణ్ ను ప్రతీ ఒక్కరు విమర్శిస్తున్నారని, ముఖ్యంగా ఆయన పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తున్నారని అది సరికాదని విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు. ఆయన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండూ వేరని, ప్రజలకు మంచి చేయడం కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.

ఆయన మీద నమ్మకముంటే ఆయకు ఓటేయాలని, లేదంటే వద్దని, కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి కామెంట్స్ చేయొద్దని సూచించారు. మానవత్వమున్న మంచి వ్యక్తి పవన్ కల్యాణ్ అని డైరెక్టర్ విశ్వనాథ్ చెప్పారు. ఏపీ ప్రజలకు మేలు చేయడం కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని అభిప్రాయపడ్డారు.

నీతి, నిజాయితీ, చిత్తశుద్ధితో రాజకీయాలు చేసేందుకు పవన్ కల్యాణ్ పాలిటిక్స్ కు వచ్చారని అభిప్రాయపడ్డారు డైరెక్టర్. ఇక ఆయన దర్శకత్వంలో తెరకెక్కి ఓటీటీలీ స్ట్రీమవుతున్న ‘పరంపర’ సిరీస్ కు చక్కటి స్పందన వస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సిరీస్ ను ఓటీటీ లవర్స్ చూసి ఎంజాయ్ చేస్తు్న్నారు. జగపతి బాబు, నవీన్ చంద్ర తదితరులు ఇందులో నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version