ఎక్క‌డా ఇవ్వ‌ని విధంగా సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్ ఇస్తున్నాం : సీఎం కేసీఆర్

-

నేడు సీఎం కేసీఆర్‌ పెద్దపల్లి జిల్లా నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్‌ సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. బీజేపీ అవినీతి గ‌ద్ద‌ల‌ను గ‌ద్దె దించి.. వారి నుంచి ఈ దేశానికి విముక్తి ప‌లుకాల‌ని అన్నారు. గుజ‌రాత్ మోడ‌ల్ అని చెప్పి ఈ దేశాన్ని మోసం చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు సీఎం కేసీఆర్‌. పెద్ద‌ప‌ల్లి జిల్లా అవుతుంద‌ని మ‌నం క‌ళ‌లో కూడా అనుకోలేదని, తెలంగాణ ఏర్ప‌డ్డ‌ది కాబ‌ట్టి పెద్ద‌ప‌ల్లిని జిల్లా చేసుకున్నామన్నారు సీఎం కేసీఆర్‌. అద్భుత‌మైన క‌లెక్ట‌రేట్‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు సీఎం కేసీఆర్‌. జిల్లా ప్ర‌జాప్ర‌తినిధుల‌ను, అధికార యంత్రాంగాన్ని, ప్ర‌జ‌లంద‌రినీ హృద‌య‌పూర్వంగా అభినందిస్తున్నానని, చాలా మంచి కార్య‌క్ర‌మాలు చేసుకున్నామన్నారు సీఎం కేసీఆర్‌.

పేద‌లు, రైతులు, ప్ర‌జ‌లు, మ‌హిళ‌లు గురించి మంచి కార్య‌క్ర‌మాలు చేసుకుంటూ ముందుకు పోతున్నామన్నారు సీఎం కేసీఆర్‌. భార‌త‌దేశ‌మే ఆశ్చ‌ర్య‌పోయే విధంగా.. అద్భుత‌మైన ప‌ద్ధ‌తిలో మ‌నం ముందుకు వెళ్తున్నామ‌ని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతం గురించి మీకు తెలుసు. సింగ‌రేణిలో వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు దొర‌కుతున్నాయి. దేశంలో ఎక్క‌డా ఇవ్వ‌ని విధంగా సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్ ఇస్తున్నాం. రామ‌గుండం ప‌ట్ట‌ణాన్ని కార్పొరేష‌న్ చేసుకున్నాం. ఏ విధ‌మైన కార్య‌క్ర‌మాలు అమ‌ల‌వుతున్నాయో మీకు తెలుసు అని తెలిపారు సీఎం కేసీఆర్‌.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version