ఏపీలో దుర్మార్గమైన పాలన నడుస్తుందని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. ఆదివారం దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరైనది కాదని మాజీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిటాల సునీత, ఆమె తమ్ముడు రమేశ్, ఆయన కొడుకు కలిసి లింగమయ్యను దారుణంగా హత్య చేశారని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం దుర్మార్గం, దౌర్జన్యానికి పరాకాష్ఠగా పాలనను కొనసాగిస్తోందని గోరంట్ల మాధవ్ తీవ్ర విమర్శలు చేశారు. కాగా, హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లనివ్వకుండా గోరంట్ల మాధవ్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.