ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రేపు అంటే మంగళవారం ఆప్షనల్ హాలిడేను ఇస్తూ సీఎస్ కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదిక మేరకు ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ పండుగ మరుసటి రోజైన ఏప్రిల్ 1న ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. మరోవైపు తెలంగాణలో సైతం రేపు పబ్లిక్ హాలిడే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక అటు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు, ఖురాన్ పఠనం, ప్రార్థనలతో ముగిసింది. జకాత్ పేరుతో సాటి వారిని ఆదుకునే దయా గుణం ముస్లిం వర్గంలోని మానవత్వానికి ప్రతిరూపం. అల్లా దయవల్ల ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలి.’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.