పార్కింగ్ వివాదం తారాస్థాయికి చేరడంతో ఒకే వ్యక్తిపై 20 మంది దాడికి పాల్పడ్డారు.ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా, పెనమలూరు మండలంలోని యనమలకుదురు శివపార్వతి నగర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
స్థానికంగా ఉండే రబ్బానీ, వీరయ్య అనే ఇద్దరు వ్యక్తుల మధ్య పార్కింగ్ స్థానం విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్త తారాస్థాయికి చేరడంతో 20 మంది వ్యక్తులు కలిసి రబ్బానీపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.దాడికి సంబంధించిన విజువల్స్ సీసీ టీవీ ఫుటేజీలో వైరల్ అయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.