మహిళల దినోత్సవం…ఉచిత బస్సుపై ఏపీ సర్కార్‌ ప్రకటన !

-

మహిళల దినోత్సవం…ఉచిత బస్సుపై ఏపీ సర్కార్‌ ప్రకటన చేసింది. ఉచిత బస్సు తో పాటు ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని తెలిపారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ఏపీ మహిళల రక్షణ కోసం ప్రత్యేకమైన యాప్ తీసుకువస్తున్నట్లు ప్రకటించారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. విశాఖ VMRDA ఎరీనాలో ఉమెన్స్ డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భగా మహిళలు నడుపుతున్న ఆటోలో ప్రయాణించారు మంత్రి డోలా.

మహిళలు ఆర్థికంగా బలపడటానికి ఆటోలు, స్కూటీలు పంపిణీ చేశారు మంత్రి డోలా. అనంతరం ఇన్చార్జి మంత్రి డోలా మాట్లాడారు. మా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళల కృషి ప్రధానమైనదన్నారు. మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు చేయూతను అందిస్తుందని ప్రకటించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించటానికి మా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో లింగ వివక్ష లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకమైన యాప్ ని లాంచ్ చేస్తున్నాన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి.

Read more RELATED
Recommended to you

Latest news