వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఉదయం 12 గంటల ప్రాంతంలో… లోక్ సభ ఈ రద్దు బిల్లు కు ఆమోదం తెలపగా… మధ్యాహ్నం రాజ్యసభ కూడా వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో, “వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు” పార్లమెంట్ ఆమోదం పొందినట్లు అయింది. ఉభయ సభల్లో మూజు వాణి ఓటు తో వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్ లో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై ఆమోదం ముద్ర పడగానే…లోక్ సభ, రాజ్య సభ రెండూ ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
ఇక రేపు ఉదయం 11 గంటల తిరిగి.. పార్లమెంట్ ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. పార్లమెంట్, అలాగే పార్లమెంట్ ఆవరణలో టీఆర్‌ఎస్ ఎంపీలు.. ధాన్యం కొనుగోలు అంశం పై నిరసనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే… ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ… టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు నిరసన తెలిపారు. కేంద్ర వైఖరి వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుందని… రెండు నెలలుగా కేంద్రం తో సంప్రదింపులు జరుపుతుంటే కేంద్రం చేతులు ఎత్తేసిందని టీఆర్‌ఎస్ ఎంపీలు ఫైర్ అవుతున్నారు. దేశ రైతాంగం రోడ్లపై ఉంటే..ఇప్పుడు తెలంగాణ రైతాంగం రోడ్డున పడేలా చేస్తున్నారన్నారు.