జమిలీ ఎన్నికలపై జనవరి 8న తొలిసారి “సంయక్త పార్లమెంటరీ కమిటీ” సమావేశం అవుతుంది. 2034లో అన్ని చట్ట సభలకు ఒకేసారి సాధారణ ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంది. ఈ “సంయక్త పార్లమెంటరీ కమిటీ” లో మొత్తం 39 మంది సభ్యులు ఉంటారు. లోకసభ నుంచి 27 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులతో కమిటీ ఉంటుంది.
ఈ కమిటీ లోని 27 మంది లోకసభ సభ్యుల్లో ఏపీ నుంచి హరీష్ బాలయోగి, బాలశౌరి వల్లభనేని, సిఎమ్. రమేష్ ఉన్నారు. అలాగే 12 మంది రాజ్యసభ సభ్యుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ఎంపీలు.. లక్ష్మణ్, విజయసాయి రెడ్డి ఉన్నారు. ముందుగా 21 మంది లోకసభ ఎమ్.పి లు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ, అన్ని పార్టీ లకు ప్రాతినిధ్యం కల్పించాలని సంఖ్యను పెంచారు. అదనంగా 6 మంది సభ్యులు లోకసభ నుంచి, రాజ్యసభ నుంచి అదనంగా మరో ఇద్దరు ఎంపీలను చేర్చారు. అయితే ఈ కమిటీ లో బిజేపి నుంచి 12 మంది సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు సభ్యులకు ప్రాతినిద్యం దక్కగా.. మిగిలిన అన్ని పార్టీల నుంచి దాదాపు ఒక్కరికే అవకాశం వచ్చింది.