వావ్‌.. వెయ్యికోట్ల క్లబ్‌లో చేరిన ‘పఠాన్‌’

-

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “పఠాన్”. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడ నటించిన ఈ సినిమా రిలీజ్ అయ్యిన నాటి నుంచి మాసివ్ ఓపెనింగ్స్ మరియు వసూళ్లతో రికార్డులు బ్రేక్ చెయ్యగా మేజర్ గా హిందీ వసూళ్లతోనే ఇప్పుడు పఠాన్ ఇండియన్ సినిమా దగ్గర మరో బిగ్గెస్ట్ రికార్డు అయితే సెట్ చేసింది. విడుదలకు ముందు ఎన్నో విమర్శలు అందుకున్నప్పటికీ.. రిలీజ్ తర్వాత తొలి రోజు నుంచే అద్భుతమైన టాక్​తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలై నెల రోజులు అవుతున్నా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. తొలి వారం రోజుల్లో అయితే ఏకంగా రోజుకో వంద కోట్లను ఖాతాలో వేసుకుంది.

అంటే ఈ సినిమా ఏ రేంజ్​లో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఐదేళ్ల విరామం తర్వాత వచ్చిన షారుక్​.. ఆకలితో వేటాడే సింహాంలా గర్జించారు.అయితే ఈ సినిమా తాజాగా మరో రికార్డును దక్కించుకుంది. ఏకంగా రూ.1000 కోట్ల క్లబ్​లోకి చేరింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్​ వసూళ్లను అందుకుంది. భారత్​లో రూ.623కోట్లు గ్రాస్​.. ఓవర్సీస్​లో రూ.377కోట్ల గ్రాస్​ కలెక్ట్ చేసింది. ఇకపోతే వరల్డ్ వైడ్​గా ​అమీర్ ఖాన్ ‘దంగల్’ రూ. 2,100 కోట్లు, ప్రభాస్ ‘బాహుబలి 2’ రూ. 1810 కోట్లు, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్’, రాజమౌళి ‘ఆర్​ఆర్​ఆర్’​ రూ.1250కోట్లు(అంచనా) వసూలు చేశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version