పవన్ కళ్యాణ్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.తన యాక్టింగ్, స్టైల్ తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కొన్ని రోజులు రాజకీయాలలో కొన్ని రోజులు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. దీనిపై ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా నాకు వేరే వ్యాపారాలు లేవు, ఇదే నా ఉద్యోగం కాబట్టి నేను పని చేస్తూ రాజకీయాలు చేస్తున్నాని చెబుతున్నారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ”హరిహర వీరమల్లు”. ఈ సినిమా లో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపు కుంటూనే వుంది. పవన్ రాజకీయాల వల్ల అడ్డంకి ఎదురవుతూనే ఉంది.. దీంతో ఎప్పుడు ఈ షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది. పవన్ కూడా ముందే తన పరిస్థితి గురించి ముందే డైరెక్టర్, నిర్మాత కు చెప్పి వున్నాడు.
ఇది ఇలా ఉండగా ఎన్నో రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెట్టాడని అంటున్నారు. ఇప్పటికే లేట్ అయ్యింది కాబట్టి వరసగా 25 రోజులు డేట్స్ ఇచ్చాడట. దీనితో యూనిట్ కూడా బ్రేక్ లేకుండా షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ సీన్స్ మొత్తం తీసేయ్యాలని షూటింగ్ చేస్తున్నారట. ఇక పవన్ మధ్యలో పాలిటిక్స్ గోల లేకుండా కంప్లీట్ గా సినిమా ప్రపంచంలోనే ఉండబోతున్నారు. పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ను రాజకీయ నాయకులు తిట్టే మాటలు వినలేక , రాజకీయాలు వదిలి సినిమాలే చేయాలని కోరుతున్నారు.