టీడీపీ, జనసేన, బిజెపి సర్దుబాట్ల వ్యవహారం కొలిక్కి వచ్చింది అంటే జనసేన ఇంకొకసారి త్యాగానికి రెడీ అయిపోయింది. బిజెపి కోసం మూడు అసెంబ్లీ స్థానాలని వదులుకుంది. జనసేన అంతకు ముందు 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పిన జనసేన 21 స్థానాల్లో మాత్రమే బరిలో నిలవనుంది. ఇప్పటికే ఒక లోక్సభ స్థానాన్ని త్యాగం చేసింది. ప్రస్తుతం 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది.
టీడీపీ ఒక అసెంబ్లీ స్థానాన్ని బిజెపికి ఇచ్చింది. బిజెపి జనసేన కలిపి 31 అసెంబ్లీ ఎనిమిది లోక్సభ స్థానాల్లో బర్లోకి దిగబోతున్నాయి. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల నేతలు ఏకాభిప్రాయానికైతే వచ్చేసారు. ఈ ఉదయం నుండి కూడా సీట్ల సర్దుబాట అంశం మీద కూటమి నేతలు చర్చలు జరిపారు. ఎనిమిదిన్నర గంటల పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.