ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న అమరావతి గ్రామాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులు దీక్ష చేస్తున్న యెర్రబాలె౦ గ్రామానికి వెళ్లి వారికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న పవన్ వారికి అండగా ఉంటా అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎవరు వచ్చినా రాకపోయినా తాను ఉంటా అని పవన్ ప్రకటించారు.
రాజధాని కోసం తాను అండగా ఉంటానన్నారు. వైఎస్ జగన్ దగ్గరకు వెళ్లి రాజధాని అవసరం లేదు, భూములు ఇవ్వాలని ఎవరైనా అడిగారా అని ఈ సందర్భంగా ప్రశ్నించగా రైతులు స్పందిస్తూ… వెంటనే కలుగజేసుకున్న రైతులు కొందరు డ్రైవర్లు, పని వాళ్ళను రైతుల ముసుగులో వైసీపీ నేతలు తీసుకువెళ్లినట్టు వివరించారు. తాను బిజెపి పెద్దలతో కూడా స్పష్టంగా మాట్లాడా అని చెప్పారు పవన్.
బిజెపి కూడా అమరావతికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ప్రధాని నడిపేది దేశాన్ని గానీ, బిజెపిని కాదని అన్నారు. ఢిల్లీ ఎన్నికల దృష్ట్యా బిజెపితో తాము ర్యాలీని వాయిదా వేశామని, రాజధాని రైతుల కోసం తప్పకుండా ర్యాలీ చేస్తామని ఆయన ఈ సందర్భంగా పవన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి ఉన్న విస్తారమైన అధికారాలతో కేంద్రం కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందని, ఎవరు వచ్చినా రాకపోయినా తాను రైతుల తోనే ఉంటా అని హామీ ఇచ్చారు పవన్.