బ్రేకింగ్; క్రిష్ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన పవన్…!

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీ గా ఉంటూనే తన వృత్తి అయిన సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అభిమానుల కోరిక మేరకు ఆయన వరుస సినిమాలు చెయ్యాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ప్రస్తుతం పింక్ అనే రీమేక్ సినిమాలో పవన్ నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జనసేన బిజెపి పొత్తు తర్వాత పవన్ కాస్త బిజీ అయ్యారు. ఈ నేపధ్యంలోనే ఆయన అనూహ్యంగా క్రిష్ సినిమాను మొదలుపెట్టారు. పింక్ రీమేక్ లో లాయర్ సాబ్ పాత్రలో నటిస్తున్న పవన్ ఆ సినిమా కోసం కేవలం 25 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది.

ఈ సినిమా షూటింగ్ ఇంకా అవకుండానే పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీకి కొబ్బరి కాయ కొట్టాడు. ఎవరికి తెలియకుండా హైదరాబాద్ లో ఈ సినిమాకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఎక్కడా వీడియో గాని ఫోటో గాని బయటకు రానీయకుండా జాగ్రత్తలు పడ్డారు. ఈ సినిమా పవన్ కు 27వ ది కావడం విశేషం. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారని టాక్. ఫిబ్రవరి 4 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version