గత ఎన్నికల్లో పవన్ ఓటమి గురించి ఇప్పటికీ వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్న విషయం తెలిసిందే. రెండు సీట్లల్లో పోటీ చేసి ఓడిపోయిన పవన్..జగన్‌ని ఓడిస్తారా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ సారి రెండు కాదు కదా..ఎన్ని స్థానాల్లో పోటీ చేసిన పవన్ ఓడిపోవడం గ్యారెంటీ అని వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో పవన్ అనూహ్యంగా రెండు చోట్ల ఓడిపోయారు.
అప్పుడు ఓట్ల చీలిక వల్ల పవన్ ఓటమి పాలయ్యారు. కానీ ఈ సారి ఆ పరిస్తితి కనిపించడం లేదు. టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయిపోయింది. పొత్తు ఉంటే పవన్ ఎక్కడ పోటీ చేసిన గెలవడం సులువు అని విశ్లేషణలు వస్తున్నాయి. పొత్తు లేకపోయినా…కొన్ని స్థానాల్లో పవన్‌కు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే పొత్తు ఉంటే ఏ స్థానంలో పోటీ చేసిన విజయం సాధించడం గ్యారెంటీ అని తెలుస్తోంది. కాకపోతే ఇప్పటివరకు పవన్ పోటీ చేసే సీటు ఏది అనేది తేలలేదు.
ఇప్పటికే పవన్ పోటీ చేసే సీట్లపై రకరకాల చర్చలు నడిచాయి. భీమవరం, గాజువాక, పిఠాపురం, నరసాపురం, కాకినాడ సిటీ లేదా రూరల్, తిరుపతి, భీమిలి..ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ పోటీపై చాలా చర్చ నడిచింది. ఇక ఎక్కువ శాతం చూసుకుంటే పవన్ భీమవరంలోనే పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది.
ఓడిన చోటే గెలిచి తీరాలనే పవన్ భావిస్తున్నారు..అందుకే భీమవరంలోనే మళ్ళీ బరిలో దిగుతున్నారని ప్రచారం వస్తుంది. ఇక భీమవరంలో పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. టీడీపీతో పొత్తు ఉంటుంది కాబట్టి…భారీ మెజారిటీతోనే గెలుస్తారని, అందులో ఎలాంటి డౌట్ లేదని విశ్లేషణలు వస్తున్నాయి.