మస్ట్ రీడ్: జ‌న‌సేనను నాశనం చేస్తున్న పవన్!

-

తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ.. రాజకీయంగా తప్పుమీద తప్పుచేస్తున్నారు పవన్ కల్యాణ్. సినిమా కథలు వినడంలో చూపించిన శ్రద్ధ… రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంలో చూపించలేకపోతున్నారు. ఫలితంగా తన శ్రద్ధంతా సినిమాలే అని చెప్పాలనుకుంటున్నట్లున్నారు! దీంతో… పసుపు రంగును కావాలని పూసుకుంటున్నారు.. జనసేనను ఒక తోకపార్టీగా మార్చేపనిలో బిజీగా ఉంటున్నారు!

pawan-kalyan

తాజాగా విడుదలయిన ఎంపీటీసీ ఫలితాలు – అనంతరం పవన్ స్పందన చూసినవారిలో చాలామంది.. పవన్ లో గొప్ప మార్పు వచ్చిందని, ఇంక జనసేన ఒక పరిపూర్ణమైన రాజకీయ పార్టీగా, అధికారపక్షానికి ప్రత్యామ్నాయంగా మారుతుందని భావించారు. అయితే… అనంతరం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో జనసేన అనుసరించిన తీరుతో… ఆ భావన మొత్తం తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి!

అవును… ఏ పసుపురంగు పూసుకోవడం వల్ల పవన్ రాజకీయంగా క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారో, మళ్లీ అదేపనికి పూనుకున్నారు! ఉదాహరణకు… పశ్చిమ‌గోదావ‌రి జిల్లాలో రెండు ఎంపీపీ స్థానాల విష‌యంలో జరిగిన సంఘటన చూద్దాం.! అక్క‌డ హంగ్ త‌ర‌హాలో ఫ‌లితాలు వెల్ల‌డి కాగా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ తెలుగుదేశానికి మిత్రపక్షంగా మారింది. ఒక చోట అయితే జ‌న‌సేనకే అధిక స్థాయిలో ఎంపీటీసీ స్థానాల‌ను పొందినా కూడా… ఎంపీపీ సీటును మాత్రం టీడీపీ సొంతం చేసుకుంది! రెండు చోట్ల ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్త‌గా.. రెండు చోట్లా టీడీపీనే ఎంపీపీ పీఠాన్ని దక్కించుకుంది!

ఇలా త‌మ‌కు కొద్దోగొప్పో బ‌లం వ‌చ్చిన చోట కూడా జ‌న‌సేన ఆ ఆత్మ‌గౌర‌వాన్ని నిల‌బెట్టుకోలేక‌పోయింది. టీడీపీకి బ‌లం లేక‌పోయినా.. ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చి ఎంపీపీ సీటును క‌ట్ట‌బెట్టింది. ఫలితంగా… పవన్.. జనాలకు ఏమి సందేహం ఇవ్వాలనుకుంటున్నారు అంటూ ప్రశ్నలు మొదలైపోయాయి. కడియం ఎంపీటీసీ విషయంలో సీరియస్ వార్నింగులు ఇచ్చిన పవన్… మిగిలిన చోట్ల ఎందుకు మిన్నకున్నారంటూ జనసైనికులే ప్రశ్నిస్తున్న పరిస్థితి!

అంటే… తాము సొంతంగా ఎంపీపీ పదవి దక్కించుకోగలిగితే.. దక్కించుకుంటాం.. లేకపోతే టీడీపీ పంచన చేరుతాం. అవసరమైతే తమ ఎంపీటీసీలను టీడీపీకి దారాదత్తం చేసి.. టీడీపీ నేతను ఎంపీపీగా ఎంపిక చేస్తాం. అంతే తప్ప తమ నేతలు అధికారపార్టీవైపు చూసినా.. అధికారపార్టీ తమ నేతలవైపు చూసినా మాత్రం సెంట్రల్ హోం మినిస్టర్ కి ఫిర్యాదు చేస్తాం అని పవన్ చెప్పదలిచారా? కడియం లో ఉన్న కసి మిగిలిన చోట్ల ఎందుకు లేదు?

ప్రస్తుతం జనసేన విషయంలో రాజకీయంగా తీవ్రంగా చర్చకు వస్తున్న విషయం ఇదే! ప్రజలు మద్దతు ఇచ్చినా, ఇవ్వకున్నా… తాను టీడీపీ మనిషిని అని, టీడీపీ తానులో ముక్కను అని, పసుపు రంగు పూసుకోవడంలో తనకు ఆసక్తి ఎక్కువని పవన్ ఎందుకు చెబుతున్నారు? అలా చెప్పడం వల్ల… పవన్ కు ప్లస్ ఏమో కానీ – జనసేన కేడర్ కు – పార్టీ భవిష్యత్తుకు ఎంత నష్టం?

ఇలా ప్రతిసారీ… జనసైనికుల కష్టాన్ని టీడీపీ ఖాతాలో వేయాలనే ఆలోచన పవన్ చేస్తున్నారు! ఇలా చేస్తున్నంతకాలం.. గ్రౌండ్ లెవెల్ లో జ‌న‌సేనను నాశనం చేస్తున్నట్లే లెక్క అనే విషయం పవన్ నిత్యం గుర్తుంచుకోవాలి! చంద్రబాబుకు మిత్రపక్షాలుగా వ్యవహరించిన పార్టీల భవిష్యత్తు ఏమైందన్న విషయంపై ఒక క్లారిటీ తెచ్చుకోవాలి! సొంతంగా ఎదిగే ఆలోచన కేడర్ కు మాత్రమే కల్పించకుండా… తాను కూడా ఆ ఆలోచన చేయాలి!

Read more RELATED
Recommended to you

Exit mobile version