పవన్ అభిమానుల పండగ షురూ.. కొత్త పోస్టర్ రిలీజ్..

-

మూడేళ్ళ తర్వాత ముఖానికి మేకప్ వేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని వెండితెర మీద చూడడానికి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. వకీల్ సాబ్ పేరుతో విడుదల కాబోతున్న సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులకి మంచి అనుభూతిని అందించాయి. మగువ మగువా నుండి మొదలు పెడితే సత్యమేవ జయతే, కంటిపాపా కంటిపాపా వరకు ప్రతీ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే మ్యూజికల్ ఫెస్ట్ పేరుతో ప్రచారం జోరందుకుంది.

ఇదే జోరులో ఉండగా తాజాగా వకీల్ సాబ్ సినిమా నుండి మరో లుక్ బయటకి వచ్చింది. కోటు సర్దుకుంటున్నట్లున్న ఈ ఫోటో అందరికీ బాగా నచ్చింది. విడుదలకి సిద్ధం అవుతున్న నేపథ్యంలో రెడీ అన్నట్లుగా ఉన్న ఈ ఫోటోతో పవన్ అభిమానులు పండగ ప్రారంభించేసుకున్నారు. హోళీ సందర్భంగా ఈ నెల 29వ తేదీన వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల కాబోతుంది. దాంతో ఇంకా హుషారుగా ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version