రూట్ మార్చిన పవన్..తెలంగాణలో ఆ సీట్లలో పోటీ?

-

ఏపీలోని జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..మరోసారి వైసీపీని టార్గెట్ చేసి విరుచుకుపడ్డారు. కాకపోతే ఈ సారి రూట్ మార్చి తెలంగాణ ప్రభుత్వానికి మద్ధతు తెలిపి…ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇటీవల తెలంగాణ మంత్రి హరీష్ రావు..ఏపీలో పరిస్తితులపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో పనిచేసే ఏపీ కార్మికులు..తెలంగాణలోనే ఓట్లు నమోదు చేయించుకోవాలని కోరారు.

 

ఏపీలో పరిస్తితులు దారుణంగా ఉన్నాయని, కాబట్టి తెలంగాణలో ఉండిపోవాలని కోరారు. దీనిపై ఏపీ మంత్రులు హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. హరీష్ ఏపీకి వచ్చి అభివృద్ధి ఎలా జరుగుతుందో చూడాలని, ప్రజలు జగన్ పాలనని ఏ విధంగా కోరుకుంటున్నారో తెలుస్తుందని అన్నారు. ఆ వెంటనే హరీష్ మళ్ళీ స్పందిస్తూ..ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ పాల్ అంశాల్లో కేంద్రంపై పోరాటం చేయలేని స్థితిలో ఏపీ అధికార పార్టీ ఉందని కామెంట్స్ చేశారు. మళ్ళీ కామెంట్స్‌కు ఏపీ మంత్రులు కౌంటర్లు ఇస్తూ వచ్చారు.

 

ఇలా జరిగి  నాలుగు రోజులు అయింది. అయితే దీనిపై పవన్ తాజాగా స్పందిస్తూ.. తెలంగాణ ఆత్మగౌర‌వం దెబ్బతిసేలా ఏపీ మంత్రులు మాట్లాడడం బాధించిందని.. వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాల‌ని.. ఒక వ్యక్తిని విమర్శించాలి తప్ప తెలంగాణ ప్రజలను మధ్యలో ఎందుకు లాగుతున్నారని, తెలంగాణ ప్రజలకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే ఏపీ మంత్రులు హరీష్ రావుకే కౌంటర్లు ఇచ్చారు తప్ప..తెలంగాణ ప్రజలని ఎక్కడ కించపర్చలేదని, అవేమీ  తెలియకుండా పవన్ గుడ్డిగా కావాలని వైసీపీపై విమర్శలు చేస్తున్నారని, ఆ పార్టీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి. పవన్ తెలంగాణలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన రూట్ మార్చి..తెలంగాణ వైపు మాట్లాడుతున్నారని కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని సీట్లలో పోటీ చేయాలని జనసేన చూస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version