ఎడిట్ నోట్: పవన్ ‘వాలంటీర్’ ప్లస్ స్కెచ్.!

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం రాజకీయంగా బాగానే వ్యూహాలు వేస్తున్నారు. ఒకప్పుడు ఆవేశంతో మాట్లాడటం తప్ప..ఆలోచనలతో రాజకీయం చేయడం తక్కువనే  పరిస్తితి. కానీ ఇప్పుడు పవన్ మారారు. ఆయన కూడా వ్యూహాలతో ముందుకొస్తున్నారు. జనసేనని బలోపేతం చేయడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ప్రజా మద్దతు పెంచుకునేలా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే వారాహి యాత్ర చేస్తూ..జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పవన్..వాలంటీర్లని గట్టిగా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఎప్పటిలాగానే వైసీపీ నేతలు..పవన్‌ని తిడుతున్నారు. అయినా పవన్ వెనక్కి తగ్గకుండా విరుచుకుపడుతున్నారు. వాలంటీర్లని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. ఇక ఇలా వాలంటీర్లని టార్గెట్ చేయడం పవన్‌కు మైనస్ అవుతుందని, వాలంటీర్లు అంటే ప్రజలకు బాగా సేవ చేసే వారు అని..వారిని టార్గెట్ చేస్తే పవన్ ప్రజా మద్ధతు కోల్పోయినట్లే అని కొందరు మేధావి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక వాలంటీర్లే..ప్రజలు అన్నట్లు చెబుతున్నారు. కానీ ఇది 100 శాతం తప్పే అని మరికొందరు అంటున్నారు.

ఎందుకంటే వాలంటీర్ల అంటే వైసీపీ వాళ్ళకే ప్రేమ తప్ప..సాధారణ ప్రజలకు పెద్దగా లేదు. ఒకవేళ వాలంటీర్ల ఓట్లు పోయిన జనసేనకు నష్టం లేదని అంటున్నారు. ఎలాగో ఉన్న వాలంటీర్లు వైసీపీకే ఓటు వేస్తారు. వారి ఓట్లు గట్టిగా చూసుకుంటే 2 లక్షలు. ఎలాగో అవి వైసీపీ ఓట్లే. కాబట్టి వారిని టార్గెట్ చేయడం వల్ల పోయేదేమీ లేదు..కానీ అదనంగా ప్లస్ అవుతుందని అంటున్నారు.

ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చాక వాలంటీర్, సచివాలయ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. అసలైన ప్రభుత్వ ఉద్యోగాలు పెద్దగా ఇవ్వలేదు. దీని వల్ల రాష్ట్రంలో 20 లక్షల వరకు నిరుద్యోగ యువత జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉంది. పైగా యూత్ లో పవన్‌కు ఫాలోయింగ్ ఎక్కువ. ఇక వారి పూర్తి మద్ధతు జనసేనకే ఉంటుందని అంచనా వేస్తున్నారు.కాబట్టి పవన్ వాలంటీర్లని టార్గెట్ చేయడం వల్ల లాభమే తప్ప..నష్టం లేదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version