క్యాష్ పేమెంట్లు చేసే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు ఎక్కువమంది ఆన్లైన్ పేమెంట్ లని చేస్తున్నారు. సులభంగా ఆన్లైన్లో పేమెంట్ మనం ఎక్కడికి వెళ్ళినా చేసేయొచ్చు దానికోసం క్యాష్ పట్టికెళ్ళక్కర్లేదు. ఎక్కువమంది గూగుల్ పే ఫోన్ పే ని ఈ రోజుల్లో వాడుతున్నారు. మీరు కూడా గూగుల్ పే ని వాడుతున్నారు. అయితే కచ్చితంగా మీరు ఈ విషయాన్ని చూడాల్సిందే. కొన్ని కొన్ని బిల్స్ ని మనం సరైన టైం కి కట్టాలి. వాటిని మర్చిపోతే పెనాల్టీ పడడం లేదంటే ఇంకా ఏమైనా ఇబ్బందులు కలగడం వంటివి జరుగుతాయి.
ప్రతి నెలా కరెంటు బిల్ కట్టడం, డిష్ బిల్ కట్టడం, రీఛార్జ్ ఇటువంటివి మర్చిపోతూ ఉంటారు చాలామంది. నిజానికి ఇలాంటివన్నీ గుర్తు పెట్టుకోవడం కష్టమే అందుకోసమే ఓ కొత్త ఫీచర్ ని గూగుల్ పే తీసుకువచ్చింది. బిల్లులు జనరేట్ అయిన వెంటనే మీకు రిమైండర్ నోటిఫికేషన్ వస్తుంది ఈ బిల్లు రిమైండర్ ఫీచర్ ని మీరు ఉపయోగిస్తే బిల్లులని గడువులోగా కట్టేయొచ్చు రిమైండర్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం.. ఇలా మీరు సెట్ చేసుకుంటే బిల్లు టైం కి కట్టేసుకోవచ్చు.
ముందుగా గూగుల్ పే యాప్‌ను తెరవండి. సాధారణ చెల్లింపుల ఎంపికపై క్లిక్ చేయాలి.
ట్రాన్సాక్షన్ కింద ఉన్న చెల్లింపు ఆప్షన్స్‌పై నొక్కండి.
ఇప్పుడు మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అవసరమైన దానిపై క్లిక్ చేయండి.
రిటర్న్ చెల్లింపుల కోసం వివరాలేమీ పెద్దగా అక్కర్లేదు. ప్రారంభ తేదీని ఎంచుకోండి.
అలానే చెల్లింపు ఫ్రీక్వెన్సీని ఎంచుకోండి.
ఆ తరవాత ట్రాన్సాక్షన్లకు ఏదైనా పేరు పెట్టండి. అప్పుడు గుర్తు పెట్టుకోవచ్చు.
చెక్‌లిస్టులో చెల్లింపు రిమైండర్‌ను చూడటానికి రిమైండర్‌ని సెట్ చేయడానికి సెలెక్ట్ అనే దాని పైన నొక్కండి.
అకౌంట్ నుంచి డబ్బులేమి కూడా డైరెక్టుగా కట్ అవ్వవు. బిల్లుల చెల్లింపు మీ పర్మిషన్‌తో మాత్రమే అవుతుంది.