డీజీపీ తన బాధ్యత తాను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది : పవన్‌

-

కోనసీమ అల్లర్లపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోనసీమ అల్లర్లలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినా పరిగణనలోకి తీసుకోలేదని తెలిసి ఆశ్చర్యపోయానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేనప్పుడు డీజీపీకి బాధ్యత ఉంటుందని, కోనసీమలో అల్లర్లు జరుగుతుంటే పోలీసులు ఏంచేస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

కాగా, తాము డీజీపీని కలవాలనుకున్నామని, కానీ ఆయన తమకు అపాయింట్ మెంట్ ఇచ్చే మైండ్ సెట్ తో లేరన్న విషయం అర్థమైందని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. ఉదయం 10.30 గంటల వరకు చూస్తామని, అప్పటికీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తామని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. డీజీపీ తన బాధ్యత తాను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఆత్మసాక్షి అనేది ఒకటుంటుదని ఉద్ఘాటించారు పవన్ కల్యాణ్. బాధ్యత ఉన్న ఎవరూ గొడవలు కోరుకోరని, సమాజంలో కీలక స్థానాల్లో ఉన్నవాళ్లే బాధ్యతల నుంచి తప్పించుకుంటే ఎలా అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version