రైతులకు శుభవార్త.. రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

-

తెలంగాణ రాష్ట్ర రైతులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ లో నాలుగవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… ఎన్నో పోరాటాలతో తెలంగాణను సాధించుకున్నాం.. తెలంగాణలోని సంపద పెరిగి… అది భావితరాలకు పంచాలని తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని పేర్కొన్నారు.

తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండేవి… తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి గమనించాలన్నారు. సమైక్య పాలనలో పన్నులు కట్టినా… రోడ్లు అభివృద్ధికి నోచుకోక అస్తవ్యస్తంగా ఉండేవి… దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టినా… గత పాలకుల రోడ్లు వేసిన పాపాన పోలేదని వెల్లడించారు.

అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి… పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టారు.. పల్లెలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెంది పరిశుభ్రంగా ఉండాలని… పల్లెలు మెరిసి ప్రజలు మురువాలని సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. గత పాలకుల హయాంలో తాగునీరు లేక వాటర్ ట్యాంకర్ల వద్ద యుద్ధాలు జరిగిన పరిస్థితులు ఉండేవి… అన్ని రంగాల్లో వెనుకబడ్డ తెలంగాణను అభివృద్ధి చేసేందుకు గత పాలకులకు మనసు రాలేదని ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version