మహారాష్ట్రలో ఎర్టీ ట్రెండ్స్ వచ్చేశాయి. మొత్తం 288 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా.. మహాయుతి (ఎన్డీయే) అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నది. మధ్యాహ్నం 3 గంటలలోపు ఫలితాలు, తదుపరి అధికారం ఎవరు చేపట్టబోయేది తేలిపోనుంది. ఇక మహవికాస్ అఘాడీ కూటమి నేతలు మరోసారి రెండో స్థానానికే పరిమితం అయ్యారు.
ఇదిలాఉండగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయన ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది.బల్లార్‌పూర్, పుణె, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్‌లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయగా.. పుణె, బల్లార్‌పూర్, షోలాపూర్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది.