Chiru Pawan Multi Starrer: మెగా బ‌జ్.. చిరంజీవి 154వ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ ​?

-

Chiru Pawan Multi Starrer: హాలీవుడ్ లాగా.. టాలీవుడ్ లో కూడా మల్టీ స్టార‌ర్ తో మూవీస్ ను తెర‌కెక్కించ‌డం ట్రెండ్ గా మారింది. ఈ చిత్రాల‌ను కూడా తెలుగు ప్రేక్ష‌కులు అమితంగా ఆద‌రిస్తున్నారు. వీటికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇప్ప‌టికే.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ తెర‌కెక్కింది.

తాజాగా మ‌రో క్రేజీ కాంబోలో మ‌రో మూవీ తెర‌కెక్క‌నున్న‌ది. అది కూడా మెగా బద‌ర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్​ క‌లిసి చేయ‌బోతున్నార‌ట‌. మెగా బ్ర‌ద‌ర్స్ సినిమా అంటే. ఇక సందడి మామూలుగా ఉండదు. మెగా ఫ్యాన్ కు ఇక పండుగ‌నే. వీరిద్ద‌రూ క‌లిసి స్కీన్ షేర్ చేసుకుంటే.. చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంత వరకు ఇది సాధ్యం కాలేదు. గతంలో చిరు నటించిన ‘శంకర్​దాదా జిందాబాద్’ సినిమాలో.. పవన్ ఓ గెస్ట్​ రోల్ చేశారు. అయితే అది పూర్తి స్థాయి పాత్ర కానందున ఫ్యాన్స్​ ఆశ ఇంకా నెరవేరలేదు. కానీ త్వరలోనే ఫ్యాన్స్​ ఆశ తీరనున్నట్లు తెలుస్తోంది.

డైరెక్ట‌ర్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మెగా స్టార్ చిరంజీవి 154వ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌లయ్యింది. మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి ప‌ల్లె టూరి కళాకారుడిగా క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఈ సంద‌ర్భంగా మూవీ యూనిట్ మెగా స్టార్ మాస్ లూక్ చూసి.. చిరు ఫ్యాన్స్ ఊర్రూత‌లూగితున్నారు. ఈ సినిమాకు వాల్తేరు శ్రీను అనే టైటిల్ పరిశీలిస్తున్నారట.

ఇదిలాఉంటే.. మరో క్రేజీ అప్డేట్ ఫీల్మ్ న‌గ‌ర్ లో తెగ వైర‌ల్ అవుతుంది. ఈ చిత్రంలో చిరు త‌మ్ముడుగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తే బాగుంటుంద‌ని దర్శకుడు బాబీ భావిస్తున్నారట. ఇప్పటికే పవన్ ని ఒప్పించే ప్రయత్నాలలో చిత్ర యూనిట్ ఉందని, ఆయన ఓకే చెబితే మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న కాంబినేషన్ సెట్ కావడం ఖాయం అంటున్నారు. అయితే ఈ చిత్రానికి పవన్​ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా? లేదా? నటిస్తే పూర్తి స్థాయిలో పాత్రా? లేదా గెస్ట్ రోల్ లో న‌టిస్తారా?అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒక వేళ ఈ అంచనాలు నిజమై చిరు, పవన్ ఒకే తెరపై కనిపిస్తే.. మెగా ఫ్యాన్స్​కు పండగనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version