నేడు ఉత్తరాంధ్ర నేతలతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఉత్తరాంధ్ర జనసేన నేతలతో నిన్న జరగాల్సిన పవన్ కళ్యాణ్ సమావేశం నేటికి వాయిదా పడింది. ఇవాళ పార్టీ నేతలతో ఆయన విడివిడిగా భేటీ కానున్నారు. అలాగే రేపు, ఎల్లుండి భీమవరంలో పర్యటిస్తారు. టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ తరుణంలోనే.. పొత్తులపై బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయం తీసుకుంటాయని మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ తెలిపారు. పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేనకు మూడో వంతు సీట్లు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఊరిలో లేనందున అనకాపల్లిలో నాగబాబు నిర్వహించిన సమావేశానికి వెళ్లలేదని తెలిపారు. నాగబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.