సొంత డబ్బులతో స్కూల్ కట్టించిన BRS మాజీ ఎమ్మెల్యే

-

BRS మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి…తన గొప్ప మనసును చాటుకున్నారు. సొంత డబ్బులతో స్కూల్ కట్టించారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి. రూ. 2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి.

Former MLA Marri Janardhan Reddy inaugurated the new school building

నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని సిర్శావాడ గ్రామంలో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు.

తాను చదువుకున్న పాఠశాలను తానే నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నానని, తన చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉండి రాబోయే రోజుల్లో ఇంకా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని మర్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఇక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి…చేసిన ఈ పని పట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version