కూటమి ప్రభుత్వంపై పట్టభద్రులు ఉంచిన విశ్వాసం నిలుపుకొంటాము అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఘన విజయం సాధించారు. ఇది చూస్తేనే.. కూటమి ప్రభుత్వం పై ఎంత నమ్మకంపెట్టుకున్నారో అర్థమైంది. పేరాబత్తుల రాజశేఖరం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లకు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ పేర్కొన్నారు పవన్.
ఇక గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే కాదు యువత ఆకాంక్షలను సైతం ఛిన్నాభిన్నం చేసింది. కానీ సీఎం చంద్రబాబు అనుభవంతో కూడిన దార్శనిక పాలనతో అన్ని పరిస్థితులనూ చక్కదిద్దుకొంటూ వస్తున్నారు. ప్రధాని మోదీ కూడా రాష్ట్ర అభివృద్ధికి బాగా సహకరిస్తున్నారు. కేంద్రం అండదండలతో- అభివృద్ధి, సంక్షేమం సమంగా చూస్తూ రాష్ట్రంలో చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. ఈ ఎన్నికల తీర్పు ద్వారా కూటమి ప్రభుత్వం పట్టభద్రులు, మేధావులు ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకుంటాము అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.