జనసేన మూసేయడానికి సిద్దమైన పవన్ కళ్యాణ్…?

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీని మూసేయడానికి సిద్డమయ్యారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. జనసేన పార్టీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల్లోకి వేగంగానే వెళ్ళింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లేందుకు గాను రైతులు, అమరావతి, విద్యార్ధుల సమస్యలను ఎజెండా గా తీసుకుని ముందుకి వెళ్లారు. ఇక ఆయన కొన్ని పోరాటాలు కూడా చేస్తూ వచ్చారు.

అయితే ఈ సమయంలో బిజెపికి దగ్గరయ్యే విధంగా ఆయన చేసిన ప్రసంగాలు అన్నీ కూడా రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచాయి. ఇక అమరావతి ఉద్యమానికి పవన్ ముందు మద్దతు ఇచ్చినా తర్వాత దూకుడు తగ్గించారు అనే చెప్పాలి. ముందు ఆ పార్టీని బిజెపిలో విలీనం చేసే అవకాశం ఉందని భావించారు అందరూ. కాని అనూహ్యంగా పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఇక ఆ పార్టీ ఆదేశాలతోనే ఆయన ముందుకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ తరుణంలో ఊహించని షాక్ పవన్ కి తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న జెడి లక్ష్మీనారాయణ పార్టీని వీడారు. పవన్ విధానాలు నచ్చలేదు అని చెప్తూ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. దీనితో ఒక్కసారిగా రాజకీయ పరిశీలకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

అయితే దీని వెనుక పవన్ వ్యూహం ఉందనే అంటున్నారు. ఒక్కొక్కరు బిజెపిలోకి వెళ్ళే అవకాశం ఉందని… ఆ తర్వాత జనసేన పార్టీని పూర్తిగా విలీనం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా లక్ష్మీ నారాయణను నియమించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. త్వరలో ఆయన బిజెపిలో చేరడం ఖాయమని అంటున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version