వైరల్ వీడియో; కోర్ట్ లో న్యాయమూర్తి ముందు గంజాయి తాగాడు…!

-

సాధారణంగా కోర్ట్ కేసు విచారణకు వెళ్ళినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే పరిస్థితి అంచనా వేయలేరు. న్యాయవాదులు, జడ్జి కూడా అక్కడే ఉంటారు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. కచ్చితంగా మన వ్యక్తిత్వాన్ని అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక వ్యక్తి కోర్ట్ హాల్ లోనే గంజాయి కాల్చి జడ్జి ఆగ్రహానికి గురయ్యాడు.

ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. టేనస్సీకి చెందిన 20 ఏళ్ల స్పెన్సర్ బోస్టన్ అనే వ్యక్తి కోర్ట్ విచారణకు హాజరయ్యాడు. టేనస్సీలోని విల్సన్ కౌంటీలో సోమవారం ఒక కేసుకి సంబంధించి న్యాయమూర్తి ఎదుట స్పెన్సర్ బోస్టన్ హాజరయ్యాడు. స్పెన్సర్ జడ్జి హేవుడ్ బారీ ముందు నిలబడ్డాడు. జడ్జి మాట్లాడుతూ ఉండగా జేబులో నుంచి గంజాయి కూర్చి ఉన్న సిగరెట్ ని బయటకు తీసాడు. దీనితో అసలు విషయం పక్కదారి పట్టింది.

కాసేపు అక్కడ ఉన్న వారికి ఎం జరుగుతుందో అర్ధం లేదు. ఏమి జరుగుతుందో తెలుసుకున్న వెంటనే కోర్టు గదిలోని అధికారులు బోస్టన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అతను రెండు దమ్ములు లాగి అక్కడ ఉన్న ప్రజలకు చూపించాడు. దీనితో అతని వద్ద ఉన్న గంజాయి స్వాధీనం చేసుకుని అతనిపై క్రమశిక్షణా రాహిత్యం కింద కేసు నమోదు చేసారు. 10 రోజులు జైలు శిక్ష విధించారు. తదుపరి విచారణ ఏప్రిల్ 14 కి వాయిదా వేసారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version