రిషికొండ‌ను ధ్వంసం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా సాగుతున్నారు : పవన్‌ కల్యాణ్‌

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. అయితే.. నిన్న.. సీఎం జగన్‌ విశాఖ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం ప్లాస్టిక్ వాడ‌కాన్ని త‌గ్గించే దిశ‌గా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. 2027లోగా ఏపీని ప్లాస్టిక్ ర‌హిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామ‌ని కూడా జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌పై శ‌నివారం సాయంత్రం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. ఈ మేర‌కు శ‌నివారం సాయంత్రం జ‌గ‌న్ వైఖ‌రిని ప్ర‌శ్నిస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. విశాఖ‌లో పారిశ్రామిక కాలుష్యాన్ని త‌గ్గించే దిశ‌గా ఇప్ప‌టిదాకా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ప‌వ‌న్ త‌న ట్వీట్‌లో ఆరోపించారు ప‌వ‌న్ క‌ల్యాణ్.

విష వాయువుల లీకేజీ, వాటి కార‌ణంగా జ‌రుగుతున్న మ‌ర‌ణాల‌ను అరిక‌ట్టే దిశ‌గానూ ఎలాంటి చ‌ర్య‌లు లేవ‌ని తెలిపారు ప‌వ‌న్ క‌ల్యాణ్. వీటికి కార‌కులైన వారిలో ఏ ఒక్క‌రిపైనా ఇప్ప‌టిదాకా చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లానే లేద‌ని పేర్కొన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్. రిషికొండ‌ను ధ్వంసం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా సాగుతున్నార‌ని ఆరోపించారు. ఇవ‌న్నీ జ‌రుగుతున్న త‌రుణంలో ఇప్పుడు ఒక్క‌సారిగా ప‌ర్యావ‌ర‌ణంపై ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది? అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. ఈ త‌ర‌హా ద్వంద్వ ప్ర‌మాణాలు ఎందుకు అంటూ జ‌గ‌న్ స‌ర్కారును ప్ర‌శ్నించారు ప‌వ‌న్ క‌ల్యాణ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version