తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను వరంగల్‌లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్బంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే.. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఆంక్షల పేరుతో ప్రభుత్వం ప్రతీసారి అడ్డుకుంటోందన్నారు బండి సంజయ్. తనను అరెస్ట్ చేసినా యాత్ర ఆగలేదన్నారు బండి సంజయ్. యాత్ర పూర్తి చేసి చూపించామన్నారు. మూసీ ప్రక్షాళన ఏమైందని ప్రశ్నించారు బండి సంజయ్.
డిండి ప్రాజెక్టు ఏమైందని నిలదీశారు బండి సంజయ్. బీజేపీ కార్యకర్తలకు జైళ్లు కొత్త కాదని బండి సంజయ్ అన్నారు. ధర్మ రక్షకులు పీడీ యాక్ట్‌లకు భయపడరని అన్నారు బండి సంజయ్. జైలుకెళ్లి వచ్చా.. కేసీఆర్‌కు రూమ్ రెడీ చేసి వచ్చా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు బండి సంజయ్. ఆంక్షల పేరుతో ప్రభుత్వం ప్రతిసారీ అడ్డుకుంటోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని, కేసీఆర్ కోసం ప్రతి జిల్లాకో జైలు రూమ్ రెడీ చేశామన్నారు సంజయ్.