ప్రధాని మోడీది ఉక్కు సంకల్పం..పవన్ కళ్యాణ్ పొగడ్తల వర్షం

-

ప్రధాని మోడీది ఉక్కు సంకల్పమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొగడ్తల వర్షం కురిపించారు. ‘ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ’- శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రస్థానానికి అద్దంపడతాయని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు.


క్లిష్ట సమయంలో పాలన చేపట్టి- ప్రాంతీయవాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలు.. అన్నింటినీ అర్థం చేసుకొని సమాదరించి ప్రతి ఒక్కరిలో భారతీయులం అనే భావన నింపారని కొనియాడారు. ప్రజారోగ్యానికి వాటిల్లిన విపత్తు, దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణకు అహరహం తపించారు. ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి శ్రీ నరేంద్ర మోదీ గారు అంటూ ట్వీట్‌ చేశారు పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version