ఒక్క కులం వల్ల అధికారం రాదు. జనసేన సాధారణ ప్రాంతీయ పార్టీ కాదు : పవన్‌

-

వారాహి యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మచిలీపట్నంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. కులాల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధించలేమని పవన్‌ వెల్లడించారు. మచిలీపట్నానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు పవన్‌. అవనిగడ్డ, మచిలీపట్నం ,పెడన, కైకలూరు కలిపితే అద్బుతమైన ప్రాంతం అవుతుందన్నారు. జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య ఆకలితో చనిపోయారంటే కడుపు తరుక్కుపోయిందన్నారు.ఒక్క కులం వల్ల అధికారం రాదన్నారు జనసేన అధినేత పవన్‌. నేను కాపు కులంలో పుట్టానని, అలా అని కేవలం కాపు ఓట్ బ్యాంక్ తీసుకుంటే ఎక్కడ ఎదుగుతామన్న పవన్‌.. అలా ఆలోచిస్తే కులనాయకుల్లా మిగిలిపోతామన్నారు.

ఒక కులానికి అంటగట్టి నన్ను ఎందుకు కులనాయకుడ్ని చేస్తారని ప్రశ్నించారు.రాజమండ్రిలో మాట్లాడుతూ కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమన్నాను.. ఏపీలో కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టే అలా అన్నానని పవన్‌ తెలిపారు. జనసేన సాధారణ ప్రాంతీయ పార్టీ కాదని.. దేశ సమగ్రతను దృష్టిలో ‌పెట్టుకొని ఆవిర్బవించిన పార్టీ అని ఆయన తెలిపారు. మున్ముందు జనసేన భావజాలమే దేశమంతా వ్యాపిస్తుందని పవన్‌ వెల్లడించారు. రాజధానికి 30 వేల ఎకరాలు అన్నప్పుడు ఆరోజు విభేదించానని ఆయన చెప్పుకొచ్చారు. రాజధాని అనేది రాత్రికి రాత్రే అభివృద్ధి కాదన్నారు. జగన్‌ను చిన్నప్పటి నుంచీ చూస్తున్నానని, రాష్ట్రానికి జగన్‌ సరైన వ్యక్తి కాదని ఆనాడే అనుకున్నానని పవన్‌ వెల్లడించారు. జనసేన పార్టీ నేతలను ఉద్దేశించి పవన్‌ కళ్యాణ్ మాట్లాడుతూ.. “బీఎస్పీ నుంచి 20 ఏళ్లు కష్టపడితే మాయావతి సీఎం అయ్యారు. పార్టీ పెట్టగానే ముఖ్యమంత్రి అయిపోవాలని లేడీకి లేచిందే పరుగులా ఆలోచించను. ఎన్టీఆర్‌కు మాత్రమే అలా సాధ్యమైంది. రాజధాని ఎక్కడ అంటే మూడు చోట్ల అని చెప్పుకోవాలా..?. తెలుగుదేశాన్ని పాలసీ పరంగానే విభేదించాను. ముప్పైవేల ఎకరాల గురించి విభేదించాను. వైసీపీ మీద వ్యక్తిగతం ద్వేషంలేదు. చిన్నప్పటి నుండి జగన్‌ని చూస్తున్నాను.. టీనేజ్‌లో ఎస్సైని కొట్డిన ఘటన చూశాను.. జగన్ రాష్ట్రానికి సరికాదని మద్దతు ఇవ్వలేదు. బ్రాహ్మణులను ద్వేషించని పార్టీ బీఎస్పీ, వాళ్లతోనే జత కలిసి సీఎం అయింది మాయావతి. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ భారత రాష్ట్ర సమితి అయిపోయింది. సనాతన ధర్మం బలంగా నమ్ముతాను, సర్వమతాలను ఆదరించే నేల అదే సనాతన ధర్మం.స్థానిక ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పనిచేస్తుంటే ఏం జరుగుతుందో అర్దమయ్యేది కాదు.” అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version