అలా అనడంతో పవన్ కళ్యాణ్ షాక్ అయ్యారు : అడవి శేష్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా అడుగుపెట్టి హీరో స్థాయి వరకు రావడం .. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం అంటే సాధ్యం కాదనే చెప్పాలి. కానీ చిరంజీవి, రవితేజ, శ్రీకాంత్ , నాని వంటి స్టార్ హీరోలు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఇక అలాంటి వారి జాబితాలో అడవి శేష్ కూడా చేరిపోయారు అని చెప్పవచ్చు . చిన్న చిన్న వేషాల నుంచి హీరో వేషాలు వరకు వెళ్లిన అడవిశేష్.. ఆ తర్వాత క్షణం , గూడచారి , ఎవరు వంటి సినిమాలతో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో పాల్గొన్న అడవి శేష్ కొన్ని విషయాలను వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ.. నేను పుట్టింది ఇక్కడే.. పెరిగిందంతా అమెరికాలో.. అయితే తెలుగునేలను కానీ తెలుగు భాషను కానీ మర్చిపోలేకపోయాను.. అందుకే మా నాన్నగారికి సినిమాల్లోకి రావాలని ఉండేది ..కానీ అందుకు కాలం సహకరించలేదు. ఇక నాకు కూడా హీరోని కావాలని ఉండేది . తెలుగు సినిమాల పై శ్రద్ధ పెరుగుతూ వచ్చింది . దాచుకున్న డబ్బుతో కర్మ అనే ఒక సినిమా చేశాను . ఆ సినిమా తెలుగులో అసలు ఆడలేదు కానీ స్పానిష్ అనువాద హక్కులు అమ్మడం వల్ల 60% డబ్బులు వచ్చాయి.. ఇక తెరపై నటుడు ఆ పాత్రకు తగ్గట్టుగా కనిపించాలి అనేది నా ఉద్దేశం.

అందుకే 84 కేజీల బరువున్న నేను మేజర్ చిత్రం కోసం 73 కేజీలకు చేరుకున్నాను. నేను బాలీవుడ్ ఆర్టిస్ట్ లా ఉంటానని, విలన్ రోల్స్ చేస్తే బాగుంటుందని దిల్ రాజు సలహా ఇచ్చారు. ఇక అందుకోసమే కెరీర్ తొలినాళ్లలో ఆ తరహా పాత్రలు కూడా చేశాను. ఇక పవన్ కళ్యాణ్ నేను హిందీ ఆర్టిస్ట్ అనుకొని నాతో హిందీ లో మాట్లాడే వారు. కానీ నేను తెలుగు వాడిని అని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఇప్పటికి కూడా చాలామంది నేను బాలీవుడ్ నటుడు నీ అని అనుకుంటారు .కానీ నేను తెలుగు అబ్బాయిని అంటూ తెలిపారు అడవిశేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version