తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

-

అమరావతి : తెలంగాణ వాసులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. భక్తి పారవశ్యాన్నే కాకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింప చేసే ఒక మహత్తర వేడుక మన బోనాలు పండుగ అని పేర్కొన్నారు పవన్‌ కళ్యాణ్‌.

లష్కర్ బోనాలుగా ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ మహంకాళి అమ్మ వారి బోనాల ఉత్సవం నేడు ప్రారంభమవుతున్న శుభవేళ అని వెల్లడించారు. ఈ సందర్భంగా తన తరపున, జనసైనికుల తరపున తెలంగాణ ప్రజానికానికి భక్తి పూర్వక శుభాకాంక్షలు అని పవన్‌ కళ్యాణ్‌ తెలియ జేశారు. తన బిడ్డలు, తన కుటుంబం, తన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. బోనమెత్తే ప్రతీ ఆడపడుచును ఆ పరమేశ్వరి ఆశీర్వదించాలని వేడుకుంటున్నానని తెలిపారు. ప్రకృతి విపత్తులు, రోగ బాధలు లేని ఆనందకర జీవితాన్ని ప్రజలందరికీ ప్రసాదించాలని మహంకాళి అమ్మవారిని ప్రార్థిస్తున్నానని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. తెలంగాణ బోనాల పండుగ ఎంతో ప్రత్యేకమైనదన్నారు పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version