రేపే కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ..3 లక్షల మందికి లబ్ది

-

నూతన రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈనెల 26వ తేదిన అంటే రేపే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేషన్‌ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులకు కొత్త రేషన్‌ కార్డులను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందించనున్నారు.

ration-cards

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ జరుగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పెండింగ్ దరఖాస్తులన్నిటిని క్లియర్ చేశారు అధికారులు. నూతనంగా 3,09,083 మందికి కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనుంది ప్రభుత్వం. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రేషన్‌ కార్డు లబ్దిదారుల సంఖ్య 8,65,430కు చేరుకోనుంది.  కొత్త రేషన్‌ కార్డు జారీ నేపథ్యంలో ప్రతి నెలకు అదనంగా 14 కోట్ల విలువ గల 5,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఈ లెక్కన సంవత్సరానికి రేషన్ పై 2766 కోట్ల నిధులను వెచ్చించనుంది తెలంగాణ ప్రభుత్వం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version