బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిన పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు

-

నమ్రతా శిరోద్కర్ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్‌ కళ్యాణ్‌ గురించి నమ్రత పెట్టిన పోస్ట్‌కి నెటిజన్స్‌ నుంచి బోల్డన్ని కామెంట్స్‌ వస్తున్నాయి. పవన్‌ అభిమానులు అయితే తెగ హంగామా చేస్తున్నారు. ఇదీ పవన్‌ అంటే.. అని హడావిడి చేస్తున్నారు పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్.

పవన్‌ కళ్యాణ్.. ఇండస్ట్రీ పార్టీస్‌కి, ఫంక్షన్స్‌కి చాలా దూరంగా ఉంటాడు. అలాంటి పవన్, మహేశ్ బాబుకి ఓ గిఫ్ట్ పంపిచడం, అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. క్రిస్మస్‌ సందర్భంగా పవన్‌ కళ్యాణ్, భార్య అన్నాలెజ్‌నోవా ఇద్దరూ మహేశ్ బాబు దంపతులకు గూడీస్‌ పంపించారు. వీటితోపాటు క్రిస్మస్ విశెష్‌ చెప్తూ గ్రీటింగ్‌ కార్డ్‌ కూడా పంపించారు మిస్టర్ అండ్ మిసెస్ పవన్.

మిస్టర్ అండ్ మిసెస్ పవన్‌ కళ్యాణ్ పంపించిన క్రిస్మస్‌ గూడీస్‌ చాలా టేస్టీగా ఉన్నాయని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది నమ్రతా శిరోద్కర్‌. పవన్‌ దంపతులు పంపించిన గిఫ్ట్ ప్యాక్, గ్రీటింగ్‌ కార్డ్‌ని నెటిజన్స్‌తో షేర్‌ చేసింది. ఇక నమ్రతా ఇలా పోస్ట్‌ చేసిందో లేదో, పవన్‌ కళ్యాణ్, మహేశ్ బాబు ఫ్రెండ్‌షిప్ గురించి చర్చలు మొదలయ్యాయి. వీళ్లిద్దరి మధ్య ఇంత థిక్‌ ఫ్రెండ్‌షిప్ ఉందా అని కామెంట్ చేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ప్రతీ సమ్మర్‌లో తన సన్నిహితులకు మామిడి పండ్లు పంపిస్తుంటాడు. తన ఫామ్‌హౌస్‌లో పండిన మామిడిపండ్లని ఇండస్ట్రీలోని అత్యంత సన్నిహితులకి మాత్రమే పంపించేవాడు. ఇప్పుడు ఫ్రెండ్స్‌కి క్రిస్మస్ గూడీస్‌ పంపిస్తున్నాడు. మహేశ్ బాబు కూడా పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా విశెష్‌ చెప్తూ ట్వీట్‌ పెట్టాడు. ఈ రెండు పోస్టులని కలిసి పవన్, మహేశ్ ఫ్రెండ్‌షిప్‌ గురించి తెగ డిస్కస్ చేస్తున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version