పవన్ శపథం..జగన్‌కు కష్టమేనా!

-

పవన్ కల్యాణ్ ఇప్పుడు ఒకే నినాదంతో ముందుకెళుతున్నారు…వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వైసీపీ విముక్త ఏపీ అంటూ పవన్ శపథం చేస్తున్నారు…అంటే జగన్‌ని అధికారానికి దూరం చేసేవరకు పవన్ నిద్రపోయేలా లేరు. అందుకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు…ఎవరితో కలవడానికైనా సై అంటున్నారు. 2014 ఎన్నికల ముందు అలాగే కాంగ్రెస్ హఠావో అని పిలుపునిచ్చి…టీడీపీ-బీజేపీ కూటమికి మద్ధతు ఇచ్చి…వారిని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశారు.

ఇక 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని విఫలమయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపడం కోసం మళ్ళీ టీడీపీతో కలవడానికి సిద్ధమవుతున్నారు. అయితే జనసేన పార్టీ పెట్టి దాదాపు 8 ఏళ్ళు దాటేసింది…ఈ ఎనిమిదేళ్ళ కాలంలో టీడీపీపై మాత్రం పవన్ పెద్దగా విమర్శలు చేయలేదు. ఏదో 2018లో కాస్త దూకుడుగా వెళ్లారు.

మళ్ళీ 2019 ఎన్నికల ముందు జగన్నే టార్గెట్ చేస్తూ రాజకీయం నడిపారు. విడిగా పోటీ చేసిన సరే…పరోక్షంగా చంద్రబాబుకు లబ్ది చేకూరాలని ట్రై చేశారు. కానీ ప్రజలు జగన్‌కు పట్టం కట్టారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలనే కసితో పవన్ తిరుగుతున్నారు. అదే సమయంలో వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని పవన్ గట్టిగానే చెబుతున్నారు…కానీ పొత్తు గురించి క్లారిటీ ఇవ్వడం లేదు.

పొత్తు మాత్రం గ్యారెంటీగా ఉండే ఛాన్స్ ఉంది…కాకపోతే ఇప్పుడే పొత్తు గురించి క్లారిటీ ఇచ్చి…మళ్ళీ టీడీపీ-జనసేన ఒకటే అని ప్రచారం జరిగితే వైసీపీకి లబ్ది చేకూరుతుందని చెప్పి..పవన్ పొత్తు గురించి ఇప్పుడేమీ చెప్పలేం అని అంటున్నారు. కానీ వైసీపీ విముక్త ఏపీ అని గట్టిగా చెబుతున్నారు. అయితే జగన్‌ని ఓడించడం అంత ఈజీ కాదు. జగన్ పై ప్రజల్లో ఆదరణ పూర్తిగా తగ్గలేదు. పైగా పథకాల వల్ల కొన్ని వర్గాల ప్రజలు పూర్తిగా జగన్‌కు మద్ధతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి జగన్‌ని గద్దె దించాలనే పవన్ శపథం నెరవేరుతుందో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version