పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఇంటి వద్దనే పోస్టాఫీసు సేవలను మరియు ప్రభుత్వ సేవలను అందించేందుకు పని చేస్తోంది. ఇండియా పోస్టల్ డిపార్ట్‌మెంట్ ప్రాజెక్టులు పై వర్క్ చేస్తోంది. అలానే టెక్నాలజీపై కూడా పని చేస్తోందని డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఉన్నతాధికారి తెలిపారు. 10 వేల పోస్టాఫీసులను ఏర్పాటు చేస్తూ పోస్టల్ సర్వీసుల రీచ్‌ను పెంచాలనుకుంటున్నారు. అలానే టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు పోస్టాఫీసుల ఆధునీకరణకు రూ.5,200 కోట్లను ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించారన్నారు.
ఇక ఇది ఇలా ఉంటే ఇటీవలే డ్రోన్ల ద్వారా గుజరాత్ లో డెలివరీలు అందించారని చెప్పారు. తాము ప్రారంభించిన ఐటీ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తామన్నారు. ప్రజలు పోస్టాఫీసులకు రావాల్సినవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా ఇంటివద్దనే ప్రజలు సేవలని పొందవచ్చని తెలిపారు అధికారులు.
బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసులను 5 కి.మీ దూరంలోనే ప్రజలకు లభించేలా చూస్తోంది ప్రభుత్వం. ఇంటివద్దనే ప్రజలు సేవలని పొందడం అనేది మంచి పద్దతి. అలా జరిగితే ప్రజలకి ఏ ఇబ్బంది ఉండకుండా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కరోనా మహమ్మారి సమయంలో ఇంటి వద్దనే రూ.20 వేల కోట్లకు పైగా ప్రజలకు సేవలను అందించింది.