ఈరోజు పవన్ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన అనంతరం ఆయన ప్రెస్ మీట్ నిర్వహింన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతో రైతుల బాధలు తెలుసుకుని.. వెంటనే పర్యటన చేయాలని నిర్ణయించామని అందుకే కరోనా నిబంధనలు ఉన్నా… ఈరోజు పర్యటన చేపట్టామని అన్నారు. ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో పర్యటించానని కంకిపాడు లో వెయ్యి ఎకరాల ఆయకట్టులో 1600 మంది రైతులు ఉన్నారని అన్నారు.
అందులో వెయ్యి మంది కౌలు రైతులే ఉన్నారని ఎకరానికి 30 నుండి35వేలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారని అన్నారు. 151 మందిని గెలిపించి పంపిస్తే.. అసెంబ్లీ లో బూతులు తిట్టుకుంటున్నారని కష్టం లో ఉన్న రైతులను ఎలా ఆదుకోవాలో చర్చ కూడా చేయడం లేదని అన్నారు. ఎకరానికి 25 నుండి 30 వేలు నష్ట పరిహారం ప్రభుత్వం ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.