క్రిష్ పనితీరుపై పవన్ కల్యాణ్ అసంతృప్తి..‘హరిహర వీరమల్లు’కు బ్రేక్?

-

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ సినిమా, పాలిటిక్స్ రెండూ చేస్తున్నారు. అక్టోబర్ నుంచి పవన్ కల్యాణ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే ఆ లోపు సినిమాల షూటింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజీకి వచ్చినట్లు వార్తలొస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ‘హరిహర వీరమల్లు’కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం..పవన్ కల్యాణ్ దర్శకుడు క్రిష్ పనితీరుపైన అసంతృప్తితో ఉన్నారట. తాను చెప్పిన మార్పులు చేస్తేనే షూటింగ్ లో పాల్గొంటానని అన్నారట. అలా ‘హరిహర వీరమల్లు’ ఫిల్మ్ షూటింగ్ కు బ్రేక్ పడిందని తెలుస్తోంది.

‘హరిహర వీరమల్లు’ షూటింగ్ రెస్యూమ్ చేయడం కోసం ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. దర్శకుడు, హీరోతో ఆయన చర్చిస్తున్నారట. మరో వైపున పవన్ కల్యాణ్ నూతన చిత్రం షూటింగ్ స్టార్ట్ అయినట్లు సమాచారం. కోలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘వినోదయ సిత్తమ్’ను తెలుగులో డైరెక్టర్, నటుడు సముద్రఖనితో రీమేక్ చేస్తున్నారని టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version