ఏపీ రాజకీయాల్లో జగన్-చంద్రబాబుల మధ్య పోలిటికల్ వార్ తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ పోరులో పవన్ కూడా కీలకంగా మారారు..ఆయన కూడా జగన్ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. ఇలా ముగ్గురు మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ బలాబలాలు పరిశీలిస్తే…ఇప్పుడున్న పరిస్తితిలో జగన్ టాప్‌లో ఉంటారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనే అధికారంలో ఉన్నారు కాబట్టి. జగన్ టాప్ లో ఉంటే ఆ తర్వాత చంద్రబాబు ఉన్నారు..ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు.
ఇక మూడో స్థానంలో పవన్ ఉంటారని చెప్పవచ్చు. పార్టీల పరంగా బలాబలాలు చూస్తే అదే లైన్ వస్తుంది. వైసీపీ-టీడీపీ-జనసేన వరుసలో ఉంటాయి. అయితే ఇలా మూడో స్థానంలో ఉన్న పవన్…సోషల్ మీడియాలో మాత్రం టాప్‌లో ఉన్నారు. ట్విట్టర్‌లో బాబు-జగన్‌ల కంటే పవన్‌కే ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారు. పవన్‌కు ఫాలోవర్స్ సంఖ్య 5.2 మిలియన్లుగా ఉంది. అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఫాలోవర్స్ 4.9 మిలియన్ల మంది ఉన్నారు. సీఎం జగన్ ట్విట్టర్ ఖాతాను 2.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
అంటే ఈ విషయంలో పవన్ టాప్‌లో ఉన్నారని చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడొక ట్విస్ట్ ఉంది..పవన్ సినీ-రాజకీయ రంగాల్లో ఉన్నారు. అందుకే ఆయనకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారని చెప్పవచ్చు. అటు పార్టీలకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే ట్విట్టర్ లో పవన్‌కు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది కాబట్టి..రాజకీయాల్లో ఆయన డామినేషన్ ఉంటుందని అనుకోవడానికి లేదు. రాజకీయాల్లో ప్రజలు వేసే ఓట్లే బలం. దాని బట్టే ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో తెలుస్తోంది. మరి నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు ఏ పొజిషన్ లో ఉంటారో చూడాలి.