నా ప్రపంచం తానే.. కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్..!

-

కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిన్నల్లుడు అందరికీ పరిచయమైనా.. గత కొద్దిరోజుల నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా శ్రీజను రెండో వివాహం చేసుకున్న కళ్యాణ్ దేవ్ దంపతులకు జన్మించిన విషయం తెలిసిందే. ఇలా వీరిద్దరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతున్న క్రమంలో ఇద్దరు విడిపోయారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు వీరు మరింత బలం చేకూర్చేలా ప్రవర్తించారు. ఎక్కడా కూడా వీరిద్దరూ కలసి కనిపించకపోవడం.. అలాగే కళ్యాణ్ దేవ్ సినిమాలకు మెగా కుటుంబం సపోర్టు లేకపోవడంతో.. మెగా కుటుంబానికి కళ్యాణ్ దూరం కావడం చూస్తుంటే ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు.

ఇకపోతే వీరిద్దరూ విడివిడిగా ఉన్నప్పటికీ విడాకుల గురించి అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. నవ్విష్క సైతం ప్రస్తుతం శ్రీజ దగ్గరే ఉంటుంది. కానీ తన కుమార్తె విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యారని తన కుమార్తె శ్రీజ వద్ద మాత్రమే కాకుండా కళ్యాణ్ దేవ్ వద్ద కూడా ఉంటుంది. గత కొద్దిరోజుల క్రితం కళ్యాణ్ కుమార్తెతో కలిసి ఉన్నటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇకపోతే తాజాగా తన కుమార్తె నవిష్కా గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా కళ్యాణ్ దేవ్ తన కుమార్తె వీడియోని ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ నా గుండె ..నా ఆత్మ.. నా జీవితంలో నాకు దొరికిన ఏదైనా ఒక గొప్ప విషయం ఉందా అంటే తన కూతురు నవ్విష్క మాత్రమేనని తెలిపారు. నా నవ్వుకు కారణం తనే.. తనే నా ప్రపంచం.. నేడు పాప పుట్టినరోజు.. హ్యాపీ బర్తడే.. నీకు శుభాకాంక్షలు లవ్ యు అంటూ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే కూతురుపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version