ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. కరెక్ట్ గా చూసుకుంటే మరో ఏడాదిలో ఈ సమయానికి ఎన్నికల ప్రక్రియ మొదలైపోతుంది..రాష్ట్రమంతా ఎన్నికల సందడి ఉంటుంది. అంటే పెద్దగా సమయం లేదు. ఏడాది అంటే ఇప్పటినుంచే అన్నీ పార్టీలు ప్రజల్లో ఉండాలి..ప్రజలని మెప్పించాలి..ప్రజల మద్ధతు పెంచుకోవాలి. ఈ విషయంలో అటు వైసీపీ, ఇటు టిడిపిలు గట్టిగా పోటీ పడుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు ప్రజా క్షేత్రంలో తలపడుతున్నాయి.
రెండు పార్టీల మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరు మరింత రసవత్తరంగా మారింది. స్థానిక సంస్థల కోటా, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలని వైసీపీ గెలుచుకున్నా..కీలకమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలని టిడిపి కైవసం చేసుకుంది. ఆఖరికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రంజుగా జరిగాయి. ఈ పోరులో వైసీపీ 7 స్థానాలు గెలుచుకోవాలని చూసింది గాని..టిడిపి అనూహ్యం గా షాక్ ఇచ్చి ఒక స్థానం గెలుచుకుంది. వైసీపీకీ 6 స్థానాలు దక్కాయి. ఇలా రెండు పార్టీలు ప్రజా క్షేత్రంలో తలపడుతున్నాయి.
కానీ ఈ విషయంలో జనసేన వెనుకపడుతుంది..పవన్ కల్యాణ్ అప్పుడప్పుడే రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఆయన రాజకీయం ఎప్పుడు మొదలుపెడతారా? అని జనసేన శ్రేణుల్లో కలవరం ఉంది. వారాహి వచ్చింది గాని..ఇంకా దాని మీద ప్రజల్లో తిరగడం మొదలుపెట్టలేదు. ప్రజల్లో తిరిగితేనే పార్టీ బలం పెరుగుతుంది. పవన్ రాకుండా కింద నేతలు..పూర్తి స్థాయిలో తిరగడం లేదు. దీని వల్ల జనసేన వెనుకబడి ఉంది.
అయితే పవన్ త్వరగా వారాహి మీద రావాలని జనసేన శ్రేణులు కోరుకుంటున్నాయి. కానీ ఇప్పుడే పవన్ వచ్చేలా లేరు..ఆయన చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి చేశాక వచ్చేలా ఉన్నారు. అంటే ఇంకో ఆరు నెలల పాటు పవన్ పూర్తి స్థాయి ప్రచారానికి వచ్చేలా కనిపించడం లేదు. ఎలాగో పొత్తు ఉంటుందని చెప్పి..పవన్ కాస్త లేటుగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.