దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, అతనికి లైడిటెక్టర్‌తో టెస్ట్ చేయిస్తే నిజాలు బయటికి వస్తాయంటూ పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీతో పాటు అమిత్ షాకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. ఆ తరువాత అనురాగ్ కశ్యప్‌పై పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వివాదం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తన ఫిర్యాదుపై ఇంత వరకు ఎలాంటి కదలిక లేకపోవడంతో తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. మాఫియా గ్యాంగ్ తనని కూడా చంపేస్తారని, కాబట్టి తనకు సాయం చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్ చేశారు. అనురాగ్‌పై ఫిర్యాదు చేస్తున్న సమయంలో రిచా చద్దా పేరుని కూడా పాయల్ ఘోష్ వాడటంతో ఆమె పాయల్‌పై విరుచుకుపడింది. పరువు నష్టం దావాని కూడా వేస్తున్నానని వెల్లడించింది.
తాజాగా ఈ వివాదంపై పాయల్ ఘోష్ స్పందించింది. కావాలనే తనని అవమానిస్తున్నారని, సుశాంత్‌లా నేను కూడా చనిపోవాలని వాళ్లు భావిస్తున్నారని, ఇప్పటి వరకు తను చేసిన ఫిర్యాదుపై ఎలాంటి స్పందన లేదని వివరించింది. బాలీవుడ్‌లో ఇతర నటీనటుల్లా తన మృతి కూడా మిస్టరీగా మిగిలేలా వుందని పాయల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన చావుని మాఫియా గ్యాంగ్ ఆత్మ హత్యగా చిత్రిస్తుందని కాబట్టి తనకు సాయం చేయాలని ఏకంగా ప్రధాని మోదీని, అమిత్ షాని కోరడం సంచలనం సృష్టిస్తోంది.