అనంతపురం కలెక్టర్ గా ఇంటర్ స్టూడెంట్…!

-

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురంలో అరుదైన సంఘటన జరిగింది. జిల్లాలో పాలనపరంగా కలెక్టర్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బాలికలకు ఒకరోజు పదవీ బాధ్యతలను అప్పగించారు. ఇక జిల్లా కలెక్టర్ గా కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న శ్రావణి ఎంపికయ్యారు. ఇక జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాల్లో అధికారులుగా బాలికలు బాధ్యతలు చేపట్టారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ‘బాలికే భవిష్యత్’ పేరుతో అనంత కలెక్టర్ గంధం చంద్రుడు చేపట్టారు.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ పదవిలో బాలికే ఉండనున్నారు. అధికారిణులుగా బాధ్యతలు స్వీకరించిన వారు… ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేయాలని కలెక్టర్ చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. తనిఖీలు నిర్వహిస్తామంటే వారికి అవకాశం కల్పించాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version