అలాంటి సినిమాలు చేయ‌నంటున్న పాయ‌ల్ రాజ్‌పుత్‌..

-

పాయల్ రాజ్‌పుత్.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. వ‌స్తూనే బోల్డ్ స‌న్నివేశాల‌తో హీటు పుట్టించింది. యూత్‌కు క‌ల‌ల రాణిగా మారిపోయింది. వరస సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆర్ ఎక్స్ 100, ఆర్డీఎక్స్ లవ్ లాంటి సినిమాలతో బోల్డ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో లెక్కలేన‌న్ని హాట్ సీన్స్ చేసింది. వీటి గురించి ప‌బ్లిక్ గానే మాట్లాడుతుంది పాయల్.


అప్పట్లో ఆర్డీఎక్స్ లవ్ మూవీ డైరెక్ట‌ర్ శంకర్ భాను తన దగ్గరికి కథ చెప్పడానికి వచ్చినపుడు ముందుగా సెక్స్ సీన్ గురించి, సెక్స్ డైలాగ్ చెప్పాడ‌ని చెప్పి సంచలనం సృష్టించింది. ఈ మూవీలోని అపరిచితులతో సెక్స్ చేసారా అనే డైలాగ్ తనకు ఫ‌స్టు చెప్పాడ‌ని ఈ ముద్దుగుమ్మ వివ‌రించింది.

ఆ డైలాగ్ తర్వాతే అసలు కథ చెప్పాడ‌ని నోరు జారింది. అప్ప‌ట్లో ఇది హాట్ టాపిక్ అయింది. ఇక టాలీవుడ్ లో త‌న‌స్థానం సుస్థిరం చేసుకోడానికి ట్రై చేస్తుంది పాయల్. మొదట్లో హద్దులు దాటినా.. ఇప్పుడు మంచి పేరున్న పాత్ర‌లు చేయాల‌ని చూస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మధ్య ఓ కొత్త డైరెక్ట‌ర్ ఈమె దగ్గరికి వ‌చ్చి ఓ స్టోరీ చెప్పాడు. అయితే వచ్చీ రాగానే ఇది బోల్డ్ కథ అని క్లారిటీ ఇచ్చేశాడంట‌. సరే అని కథ చెప్పమంటే.. మొత్తం బెడ్రూమ్ సీన్ లే ఎక్కువ‌గా చెప్పాడ‌ని పాయ‌ల్ స‌న్నిహితులు తెలిపారు. కేవ‌లం ముప్పై నిముషాల్లోనే 5 స‌న్నివేశాలు అవే ఉండ‌టంతో చాలా సున్నితంగా పాయ‌ల్ ఈ కథను వ‌ద్ద‌ని చెప్పిందంట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version