ల్యాప్‌టాప్ కొనేందుకు ఇదే స‌రైన స‌మ‌యం.. పేటీఎం మాల్‌లో భారీ డిస్కౌంట్లు..

-

ల్యాప్‌టాప్ కొనేందుకు ఎదురు చూస్తున్నారా ? వ‌ర్క్, గ్రాఫిక్స్‌, గేమ్స్ ఇలా భిన్న ర‌కాల అవ‌స‌రాల కోసం భిన్న‌మైన ఫీచ‌ర్లు క‌లిగిన ల్యాప్‌టాప్‌ల‌ను కొనాల‌ని చూస్తున్నారా ? అయితే అందుకు ఇదే స‌రైన స‌మ‌యం అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే పేటీఎం మాల్ అన్ని ర‌కాల ల్యాప్‌టాప్‌ల‌పై భిన్న ర‌కాల డిస్కౌంట్ల‌ను అందిస్తోంది.

నిత్యం ప‌లు చోట్ల‌కు తిరిగేవారు ల్యాప్‌టాప్ కొనాల‌ని అనుకుంటే వారికి థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్‌లు అనువుగా ఉంటాయి. ఇవి బ‌రువు ఎక్కువ‌గా ఉండ‌వు. తేలిగ్గా ఉంటాయి. ఎక్క‌డికంటే అక్క‌డికి వీటిని సుల‌భంగా తీసుకెళ్ల‌వ‌చ్చు. అందుక‌ని నిత్యం ప్ర‌యాణాలు చేస్తూ వ‌ర్క్ చేసే వారికి ఈ త‌ర‌హా ల్యాప్‌టాప్‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. డెల్‌, లెనోవో, హెచ్‌పీ, అసుస్ కంపెనీలు ఈ త‌ర‌హా ల్యాప్‌టాప్‌ల‌ను అందిస్తున్నాయి. వీటిపై 30 శాతం వ‌ర‌కు పేటీఎం మాల్‌లో డిస్కౌంట్ ల‌భిస్తోంది.

వ‌ర్క్ ఫ్రం హోం చేసే వారికి కూడా ల్యాప్‌టాప్ కంపెనీలు ఎవ్రీ డే యూజ్ ల్యాప్‌టాప్‌ల‌ను అందిస్తున్నాయి. వీటిపై పేటీఎం మాల్‌లో 30 శాతం రాయితీని అందిస్తున్నారు. డెల్ ఇన్‌స్పిరాన్ సిరీస్, అసుస్‌ల‌లో ఈ త‌ర‌హా ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. హై ఎండ్ పెర్ఫార్మెన్స్‌ను ఆశించే వారు డెల్‌, అసుస్‌, లెనోవో కంపెనీల‌కు చెందిన ల్యాప్‌టాప్‌ల‌ను ఎంచుకోవ‌చ్చు. వీటిపై 25 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

ఇక చివ‌రిగా గేమింగ్, గ్రాఫిక్స్ అవ‌స‌రాలు ఉన్న‌వారి కోసం డెల్ ఏలియ‌న్ వేర్‌, ఏస‌ర్ ప్రిడేట‌ర్ సిరీస్ ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిపై పేటీఎం మాల్‌లో 30 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version